అనిల్ అంబానీ గ్రూప్‌నకు ఈడీ భారీ షాక్: రూ. 510 కోట్ల ఆస్తులు జప్తు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహారాష్ట్ర
అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రూ. 510 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిందని అధికారులు వెల్లడించారు. వేల కోట్ల బ్యాంకింగ్ మోసం మరియు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో రెండు ప్రైవేట్ జెట్ విమానాలు, భూములు, తమిళనాడులో విండ్ మిళ్లు జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమోటర్లు ప్రజాధనాన్ని విదేశాలకు మళ్లించారని, ఇప్పటివరకు మొత్తం రూ. 23,100 కోట్ల ఆస్తులు రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు.