వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఫలించడంతో వారి ఉపకార వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లకు స్టైపెండ్‌ను 10 శాతం పెంచగా, పీజీ డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు 5 శాతం పెంపుదల వర్తింపజేసింది. పెరిగిన ఈ వేతనాలు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.