పల్నాడు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం షాప్ యజమాని మృతి

రిపోర్టర్: నరేష్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో KSSR క్రాకర్స్ షాపులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో షాప్ యజమాని భూమసురేష్ మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో షాపులో పనిచేస్తున్న సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.