ఆసియా క్రీడల క్వార్టర్స్‌లో జపాన్‌పై భారత్ మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

జపాన్‌తో జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించింది. శ్రీ చరణి నాలుగు వికెట్లతో చెలరేగగా, షెఫాలి వర్మ రాణించడంతో జపాన్‌ను కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ సులభంగా ఛేదించి బంగ్లాదేశ్‌తో జరిగే సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించింది.