కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: సతీష్
స్థలం: Telangana
కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ Bharat Rashtra Samithi (BRS) తీవ్ర ఆరోపణలు చేసింది. కేవలం మూడు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల కోట్ల సంపదను సమకూర్చుకోవచ్చని, రబీ పంట సాగు ద్వారా రైతులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొంది. పాలన చేతగాక రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రాజెక్టులపై అవగాహన లేని దద్దమ్మ అంటూ ఘాటు విమర్శలు గుప్పించింది.