రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లే తెలంగాణలో రైతుల ఆక్రందనలు అంటూ హరీశ్ రావు తీవ్ర విమర్శలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లనే ఏపీలో రైతులు కేరింతలు కొడుతుంటే తెలంగాణలో రైతులు ఆక్రందనలు మిగిలాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బేసిన్ కాని కుప్పంకు నీళ్లు తరలిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం సొంత జిల్లా పంటలను ఎండబెడుతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ రంగంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాజస్థాన్‌కు కరెంటు ఇస్తూ రాష్ట్రంలో రైతులకు సరిగ్గా విద్యుత్ ఇవ్వడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.