ఏపీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 37.91 శాతం సీట్లు భర్తీ

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ తొలి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 37.91 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్‌ కోటాలో 3.80 లక్షల సీట్లకు గాను 1.44 లక్షల మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చేరాలని ఉన్నత విద్యాశాఖ కన్వీనర్ డాక్టర్ సి.కృష్ణ స్పష్టం చేశారు.