ధర్మసత్రంగా మారిన సింగరేణి అతిథి గృహం.. రియాజ్ అహ్మద్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

సింగరేణి ఉద్యోగులు, అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల కోసం హెడ్ ఆఫీస్ కొత్తగూడెంలో నిర్మించిన అతిథి గృహం ధర్మశాస్త్రంగా మారిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సంస్థ నిధులతో నిర్మించిన అతిథి గృహంలోని గదులను ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు ఇవ్వడం వల్ల మెడికల్ బోర్డుకు వచ్చే కార్మికులు ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. యాజమాన్యం వెంటనే స్పందించి గెస్ట్ హౌస్ గదులను సంస్థలో పనిచేసే వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.