మణిపూర్ లో దుండగుల కాల్పుల్లో ఇద్దరు నాగ యువకులు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: సేనాపతి
మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లా కలేంజాగ్ గ్రామంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మౌ నాగ యువకులు మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి నుంచి నాగ-కుకీ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్రం ఇబోబి సింగ్ తీవ్రంగా స్పందిస్తూ, ప్రభుత్వాలు సైలెంట్ స్పెక్టేటర్లుగా మారాయని మండిపడ్డారు. యునైటెడ్ నాగ కౌన్సిల్ ఎకనామిక్ బ్లాకేడ్ ను విరమించుకుంది.