సినిమా ట్రైలర్ విడుదల: రాజకీయాల్లోకి సూర్య ఎంట్రీపై ఆసక్తికర చర్చ

రిపోర్టర్: రాము స్థలం: Chennai

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సీన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో సూర్య పోలీసు అధికారిగా వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు దర్శకుడు జితు మాధవన్ వెల్లడించారు. నజీరియా, నస్లెన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ లో రాజకీయ ప్రవేశంపై వచ్చిన సంభాషణ ప్రస్తుతం సినీ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.