పాలేరులో రూ.205 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు అంటూ మంత్రి పొంగులేటి వెల్లడి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Khammam Rural

పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.205 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ వద్ద కొత్తగా నిర్మించిన విద్యుత్ శాఖ కార్యాలయాలను కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో గృహ జ్యోతి లబ్ధిదారులకు రూ. 40.19 కోట్ల సబ్సిడీ అందించామని, నిరంతర విద్యుత్ సరఫరా కోసం నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.