పండుగ వేళ విద్యుత్ షాకుతో హోంగార్డు బలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు
వినాయక చవితి పండుగ వేళ ఆత్మకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో వినాయక మండప ఏర్పాటులో భాగంగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేస్తుండగా హోంగార్డు మల్లం ప్రసాద్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ప్రసాద్ ఆకస్మిక మృతితో పోలీస్ క్వార్టర్స్ తో పాటు ఆయన స్వగ్రామమైన మర్రిపాడు మండలం కృష్ణాపురంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికులను, పోలీసు సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది.