అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం: ఖమ్మం కలెక్టర్ దివాకర హెచ్చరిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
అక్రమ మైనింగ్ ను సహించేది లేదని, ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం కలెక్టర్ దివాకర టి.ఎస్ శుక్రవారం స్పష్టం చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో వెలుగుమట్ల ప్రాంతంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.