రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు లేవు

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

రూ.2,000 వరకు యూపీఐ మరియు రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులకు ఎలాంటి అదనపు భారం పడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.