పాకిస్థాన్లో రాజకీయ కలకలం: ఇమ్రాన్ ఖాన్ ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసిన అధ్యక్షుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: పాకిస్థాన్
పాకిస్థాన్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వాన్ని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సస్పెండ్ చేసినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో ఉగ్రవాద దాడులను అడ్డుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం స్పష్టం చేసింది.