రామ్చరణ్ సుకుమార్ చిత్రంలో బాలీవుడ్ భామ అనీత్ పడ్డా ఎంట్రీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అగ్ర హీరో రామ్చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నటిగా బాలీవుడ్ భామ అనీత్ పడ్డా పేరు పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. సైయారాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సుందరి తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలలోనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు.