సెక్షన్ 22ఏ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది పడుతున్న వేలాది మంది ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్నప్పటికీ టెక్నికల్ లోపాలతో సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకున్న ఆస్తులకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.