టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా నియామకం: కమిటీలో రమేశ్ పవార్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
టీమిండియా పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను బీసీసీఐ నియమించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పదవికి ఆయన ఏడాదికి సుమారు మూడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు సమాచారం. అలాగే ఈ సెలక్షన్ కమిటీలో మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌కు కూడా స్థానం లభించింది. యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పించడంతో పాటు జట్టు కూర్పుపై ఈ నూతన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.