డిజిటల్ అరెస్ట్ మోసం: వృద్ధుడి నుంచి పది కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
విజయవాడకు చెందిన వృద్ధుడిని డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించి పది కోట్ల రూపాయలు కాజేసిన కేసులో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. నిందితులు ఆ సొమ్మును చిన్న మొత్తాలుగా విభజించి వివిధ రాష్ట్రాల్లోని వందలాది ఖాతాలకు బదిలీ చేసినట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దిల్లీలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతో ఈ భారీ మోసం గుట్టు రట్టయింది. ఈ నేపధ్యంలో పోలీసులు త్వరలో కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయనున్నారు.