వైసీపీకి షాక్.. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి మజ్జి శ్రీను రాజీనామా

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు పేర్కొన్న ఆయన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది.