పాత కొమ్ముగూడెంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్షేట్టిపేట

లక్షేట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామంలో లబ్ధిదారులకు ఐదు వందల ఇరవై ఏడు రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ దుమ్మని సత్తయ్య ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. రేషన్ కార్డు స్థానంలో కుటుంబ సభ్యుల వివరాలతో ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డును అందజేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు.