హైదరాబాద్ లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు: సహాయక కమిటీల ఏర్పాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని హైటెక్స్ లో నవంబర్ 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వార్షిక సదస్సు విజయవంతం కోసం రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సహాయక కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు జీవో-560 జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సదస్సు నిర్వహణ కోసం మొత్తం పన్నెండు విభాగాలకు ప్రత్యేక కమిటీలను నియమించి, ఆర్అండ్బీ ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారు.