బొబ్బిలిలో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్ శంకుస్థాపన
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘంలో హెచ్ఏఎం రూ.25 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కుప్పం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. బొబ్బిలిలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే బేబీ నాయన ఈ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.