ఎన్టీఆర్ కమిషనరేట్‌లో భారీగా పెరిగిన సైబర్ మోసాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఎన్‌సీఆర్పీ, 1930 పోర్టల్‌కు 2,145 ఫిర్యాదులు అందగా బాధితులు రూ.21.90 కోట్లు పోగొట్టుకున్నారు. పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ, ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసగాళ్లు నిలువునా ముంచుతున్నారు. చదువుకున్నవారే ఎక్కువగా ఈ సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.