తిరుమల ల్యాబ్ అభివృద్ధి: దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీటీడీ అదనపు ఈవో స్పష్టీకరణ

రిపోర్టర్: గోపి స్థలం: తిరుమల

తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు తితిదే అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో బుధవారం నిర్వహించిన ఆయుధపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ల్యాబ్ కార్యకలాపాలు, పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ సహకారంతో కేవలం పదకొండు నెలల్లోనే అత్యున్నత ప్రమాణాలతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.