ఉత్కంఠ రేకెత్తిస్తున్న కొత్త సినిమా టీజర్: విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ఇంద్రరామ్, రవీంద్ర విజయ్, తబా రీమా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా టీజర్ను ప్రముఖ నటులు విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, నాగచైతన్య కలిసి విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. హీరోని కలలో చంపాలని ప్రయత్నించిన ఓ అపరిచిత వ్యక్తి నిజ జీవితంలోనూ వేటాడే విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.