మోక్షజ్ఞ తొలి సినిమాపై భారీ అంచనాలు: కీలక పాత్రల్ లో కాజోల్ రాషా
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ తేజ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. ఆయన తొలి సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం ఇప్పటికే టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం వస్తోంది.