విజయవాడలో అరవై వేల మందికి సంపూర్ణ ఇళ్ల పట్టాల పంపిణీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

విజయవాడ, విశాఖ, మంగళగిరిల్లో అరవై వేల మందికి పైగా పేద కుటుంబాలకు సంపూర్ణ ఇళ్ల పట్టాలను అందజేయడాన్ని తన జీవితంలో మరచిపోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులతో కూడిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ ఆస్తులను అమ్ముకోకుండా భవిష్యత్తు కోసం కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.