వెలిగొండ సొరంగాల పనుల్లో ప్రతిభ చూపిన ఇంజినీర్లకు నగదు అవార్డులు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల నిర్మాణంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన పదకొండు మంది ఇంజినీర్లకు నగదు అవార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. నల్లమల కొండల్లో భూగర్భంలో అష్టకష్టాలు పడుతూ పనులను పర్యవేక్షించిన ఈ ఇంజినీర్ల సేవలను గుర్తించి, బొగ్గు గనుల తరహాలో ప్రమాదభత్యం కింద ఆర్థిక సహాయం అందించేందుకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వారు తెలిపారు.