తహసీల్దార్ కార్యాలయంలో ఊడిపడిన ఫ్యాన్ తీవ్ర గాయాలతో యువకుడు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా నాగలాపురం తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికేట్ల కోసం వచ్చిన శివకుమార్ అనే యువకుడిపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిందని అధికారులు తెలిపారు. రెవెన్యూ సేవల కోసం తండ్రితో కలిసి కార్యాలయానికి వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ఫ్యాన్ కింద పడటంతో శివకుమార్ చెవికి తీవ్ర గాయమైందని వెల్లడించారు. వెంటనే స్పందించిన బంధువులు బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.