తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆరో రోజు వేడుకలు
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుమల
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం మలయప్ప స్వామి కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. వివిధ రాష్ట్రాల కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం స్వర్ణ రథంపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.