పొదలకూరులో అమర పోలీసులకు కన్నీటి నివాళులర్పించిన ఖాకీల క్యాండిల్ ర్యాలీ

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదలకూరులో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ సిబ్బందితో కలిసి పోలీస్స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. దేశ రక్షణలో అమరులైన వారి సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.