టీడీపీలో చేరిన విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

విశాఖపట్టణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారని అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో ఆయనను గతంలో వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.