అశాస్త్రీయంగా వార్డుల విభజన చేపట్టారంటూ ఆర్డీవోకు మాజీ ఎమ్మెల్యే గణేష్ ఫిర్యాదు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా జరిగిందని మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఓటర్ల సంఖ్యలో పది శాతం మాత్రమే తేడా ఉండాలని, కానీ నర్సీపట్నంలో నలభై శాతానికి పైగా తేడా ఉండేలా అధికార పార్టీకి అనుకూలంగా మార్పులు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమాలపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.