అనుమతులు లేకుండా నడుపుతున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న గోపాల్

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు రూరల్

నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డి నగర్ వేదాయపాళెం ప్రాంతంలో విద్యాశాఖ అనుమతులు లేకుండానే విషన్ స్పార్క్ స్కూల్ నిర్వహిస్తున్నారని ఏపీ స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కురపాటి గోపాల్ ఆరోపించారు. విద్యా హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాల నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.