ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణకిశోర్ ఎన్నిక
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్నూలు
కర్నూలులో నిర్వహించిన ఈఎన్టీ వైద్యుల సంఘం 44వ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖకు చెందిన డాక్టర్ టి.కృష్ణకిశోర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా కాకినాడకు చెందిన డాక్టర్ జి.ఎస్.ఎన్.మూర్తి ఎన్నికయ్యారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వార్షిక సర్వసభ్య సమావేశాలు ఘనంగా ముగిశాయి.