జీవో 76 పట్టాలు ఇవ్వాలి ఎం సిపిఐ యు డిమాండ్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జీవో 76 కింద చలానాలు చెల్లించిన ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి యాజమాన్య హక్కులు కల్పించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ చలానాలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా పట్టాలు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. లేనిపక్షంలో బాధితులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.