పెంపుడు కుక్క కస్టడీ వివాదం: అమెరికా కోర్టులో వ్యక్తికి ఎదురుదెబ్బ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కనెక్టికట్
మాజీ భాగస్వామితో కలిసి పెంచుకుంటున్న కుక్కను తనకు అప్పగించాలంటూ కోరిన అలెగ్జాండర్ గైనర్ అప్పీల్ ను కనెక్టికట్ అప్పీలేట్ కోర్టు కొట్టివేసింది. చట్టప్రకారం పెంపుడు జంతువులపై ఉమ్మడి యాజమాన్య హక్కులు కల్పించే వెసులుబాటు లేదని న్యాయస్థానం స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బజ్ అనే చిహువా జాతి కుక్క కస్టడీ కోసం జరిగిన న్యాయపోరాటంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే అప్పీలేట్ ధర్మాసనం సమర్థించినట్లు అధికారులు తెలిపారు.