విశాఖలో పేదలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ
రిపోర్టర్: వెంకట్
స్థలం: పార్వతీపురం మన్యం
విశాఖపట్నంలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా 28,445 మందికి రెగ్యులరైజేషన్ పట్టాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సుమారు రూ.8,874.27 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు, 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాలకు సంబంధించిన శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు.