విద్యుత్ షాక్ తో వ్యక్తి దుర్మరణం
రిపోర్టర్: dumarla bhaskar senier journalist
స్థలం: అచ్చంపేట
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన అచ్చంపేట మున్సిపాలిటీలోని లీలా నగర్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. అచ్చంపేట ఎస్సై నరేష్ వివరాల మేరకు బల్మూరు మండలం గట్టు తుమ్మెద గ్రామానికి చెందిన పుల్లెందుల రాజు( 29) డీజే వాహనానికి రిపేరు రావడంతో రిపేరు సెంటర్ ముందు వాహనాన్ని ఉంచాడు. సాయంత్రం కురిసిన వర్షానికి డీజే బాక్సులు నీటితో తడవకుండా ఉండేందుకుగాను బాక్స్ లకు పై పాలిథిన్ కవర్ కపీ క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు కలిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.