రాజాపేటలో త్వరలోనే పండుగ సాయన్న విగ్రహం: ముదిరాజ్ సంఘం కీలక ప్రకటన
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో త్వరలోనే ముదిరాజ్ ప్రజా వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, విగ్రహ దాత పులి చంద్రమౌళి వెల్లడించారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజు కులస్తులతో పాటు ఇతర ప్రాంతాల దాతల సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ మహోత్సవానికి ప్రజలంతా అధిక సంఖ్యలో తరలిరావాలని ఆకాంక్షించారు.