ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిపై ఎమ్మెల్యే నాయిని సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Warangal

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి నిధులు ఖర్చు చేయడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానుందనే ఉద్దేశంతోనే తాము ఎంజీఎంకు నిధులు కేటాయించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంజీఎం ఆసుపత్రి ప్రస్తుత దుస్థితికి చేరిందని నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.