చెన్నై నుండి బెంగళూరుకు వ్యాపార మార్పు: గ్రీన్సిగ్నల్ ఇచ్చిన యువ వ్యవస్థాపకుడు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Bengaluru

చెన్నై నుండి బెంగళూరుకు తను స్థాపించిన సంస్థ కార్యకలాపాలను మార్చడం ద్వారా అద్భుతమైన ప్రయోజనం చేకూరిందని అగ్రిటెక్ ఫౌండర్ హరీష్ వరదరాజన్ వెల్లడించారు. తన వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ఈ నిర్ణయం ఎంతో మేలు చేసిందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, కస్టమర్లతో పాటు స్టార్టప్ నెట్వర్క్ త్వరగా అందుబాటులోకి రావడం వల్ల తమ కంపెనీకి మంచి వృద్ధి కనిపిస్తోందని లింక్డిన వేదికగా ఆయన స్పష్టం చేశారు.