ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నల్లగొండ జిల్లా
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తెలకంటి గూడెం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం పొలాల సమీపంలోని సబ్ స్టేషన్‌ను సందర్శించి లాగ్ బుక్‌ను పరిశీలించారు. విద్యుత్ సరఫరా తీరుపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై అధికారులను నిలదీస్తూ వారిని అప్రమత్తం చేశారు.