మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఘన నివాళులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హన్మకొండ
మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆయన చిత్రపటానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినట్లు వరంగల్ పోలీస్ వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా మహర్షి వాల్మీకి సేవలను, ఆయన అందించిన గొప్ప సాహిత్య సందేశాలను అధికారులు స్మరించుకున్నారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.