వరద కాలువల పనులకు పచ్చజెండా ఊపిన మున్సిపల్ అధికారులు
రిపోర్టర్: saikiran
స్థలం: రంగారెడ్డి
స్పెషల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సీఎంసీ తొమ్మిదో స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమీన్పూర్ సర్కిల్ కార్యాలయ భవనం మరియు వివిధ ప్రాంతాల్లో దాదాపు పద్దెనిమిది కోట్లతో వరద కాలువల ఆధునీకరణ పనులకు ఆమోదం తెలిపారు. విలీన ప్రాంతాల పారిశుధ్య కార్మికుల వేతనాలను నవంబర్ మొదటి తేదీ నుంచి పెంచుతూ నిర్ణయం ప్రకటించారు.