అనంతపురంలో వైకాపా నేతల హడావుడి: పోలీసులతో వాగ్వాదం, ఇరువర్గాల మధ్య తోపులాట
రిపోర్టర్: విజయ్
స్థలం: అనంతపురం
అనంతపురం నగరం ముప్ పై ఒకటో డివిజన్ పరిధిలో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను అనుమతించడం లేదంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారని పోలీసులు తెలిపారు. వైకాపా నాయకులు భారీగా చేరుకోవడంతో తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో రెండు పార్టీల వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుందని, పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారని అధికారులు వెల్లడించారు.