ఒడిశాలో ఐదు అరుదైన ఒరాంగుటాన్ కూనల గుర్ತಿంపు

రిపోర్టర్: నరేష్ స్థలం: Odisha

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఐదు ఒరాంగుటాన్ కూనలు విడిచిపెట్టబడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. భారత్‌లో సహజంగా లభించని ఈ జంతువులు అంతర్జాతీయ అక్రమ రవాణాలో భాగంగా ఇక్కడికి చేరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌కు వీటిని తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో విచారణ చేపట్టింది.