భారీ కార్చిచ్చుల ఉచ్చులో ఇండోనేషియా: నారింజ రంగులోకి ఆకాశం మారిన వైనం
రిపోర్టర్: మహేష్
స్థలం: Indonesia
ఇండోనేషియాలో చెలరేగిన భారీ కార్చిచ్చుల కారణంగా ఆకాశం భయానక నారింజ రంగులోకి మారిపోయిందని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వెల్లడించారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాలైన సింగపూర్, మలేషియాలకు కూడా ఈ పొగ వ్యాపించడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.