తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణ: మూడు రకాలకు ఎంఆర్పీ ఖరారు చేసిన సర్కార్
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో విక్రయించే వివిధ రకాల బియ్యానికి గరిష్ఠ చిల్లర ధరలను ఖరారు చేస్తూ పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులపై అదనపు భారం పడకుండా బీపీటీ, కేఎన్ఎం రకం కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రూ.79 చొప్పున ధరలు నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.